Earthquake: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 2:26 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదు: అర్ధరాత్రి వేళ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇళ్లలోని వస్తువులు కదలడం, వింత శబ్దాలు రావడంతో స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఏం జరుగుతుందో తెలియక.. ప్రాణభయంతో తక్షణమే ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైనట్లు సమాచారం.

