HomeTop StoriesEarthquake: తెలంగాణ సరిహద్దుల్లో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 4.6గా నమోదు!

Earthquake: తెలంగాణ సరిహద్దుల్లో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 4.6గా నమోదు!

Earthquake: తెలంగాణ సరిహద్దు పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. మహారాష్ట్ర, తెలంగాణ బోర్డర్‌లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. దీని ప్రభావంతో అటు మహారాష్ట్ర జిల్లాలతో పాటు ఇటు తెలంగాణ సరిహద్దు జిల్లాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

- Advertisement -

వరుస ప్రకంపనలతో పరుగులు తీసిన జనం: అర్ధరాత్రి వేళ ప్రజలంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. అర్ధరాత్రి 1:30 గంటల నుంచి తెల్లవారుజామున 3:23 గంటల వరకు వరుసగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నిద్రలో ఉండగానే ఇళ్లలోని సామాన్లు కదలడం, గోడలు ప్రకంపనలకు గురికావడంతో జనం ఒక్కసారిగా మేల్కొన్నారు. ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయంతో ఇళ్లను వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు. రాత్రంతా రోడ్లపైనే గడిపారు.

Also read-Gas cylinders: మహారాష్ట్రలో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన 3,000 సిలిండర్లు!

పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు: భూకంప కేంద్రం మహారాష్ట్రలో ఉన్నప్పటికీ, దాని ప్రభావం సరిహద్దు దాటి తెలంగాణ వరకు తాకింది. మహారాష్ట్రలోని నాందేడ్‌, హింగోలి, పర్భణీ జిల్లాల్లో భూమి తీవ్రంగా కంపించింది. మహారాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భూప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. ఈ ప్రాంతాల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రస్తుతానికి ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదు. అయినప్పటికీ సరిహద్దు జిల్లాల అధికారులు వాతావరణ, భౌగోళిక పరిశోధన సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News