Model Code of Conduct violation: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాన్‌లోకల్ నేతలు యథేచ్ఛగా తిరగడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానికేతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్‌కు రావడంపై సీరియస్ అయ్యింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద.. బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, శంకర్ నాయక్‌లపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించింది.
అధికార నేతల విషయంలో ఉదాసీనత ఆగ్రహం: స్థానికేతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్న నాన్ లోకల్ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు.. అధికార నేతల విషయంలో ఉదాసీనతగా వ్యవహరించడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. వెంటనే బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, శంకర్ నాయక్‌లపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉంల్లంఘించడంపై కేసు నమోదు చేయాలని పేర్కొంది.
నాన్‌లోకల్స్‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు: జూబ్లీహిల్స్ పోలింగ్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి స్పందించారు. నియోజకవర్గంలో నాన్‌లోకల్స్ నేతల సంచారంపై కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్టుగా తెలిపారు. ఇప్పటివరకు నాన్‌లోకల్స్‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. మొరాయించిన ఈవీఎంల స్థానంలో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఇప్పటివరకు 9 చోట్ల ఈవీఎంలను మార్చినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని అన్నారు.


