HomeTop StoriesIPL: లేజర్ షోలో సగం భారత్ మ్యాప్ మాయం.. మండిపడుతున్న నెటిజన్లు!

IPL: లేజర్ షోలో సగం భారత్ మ్యాప్ మాయం.. మండిపడుతున్న నెటిజన్లు!

IPL-2026: ఐపీఎల్ 2026 సీజన్ క్వాలిఫైయర్-1 మ్యాచ్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియంలో జరిగిన ఒక ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య మంగళవారం జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో నిర్వాహకులు చేసిన ఒక పెద్ద తప్పు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

- Advertisement -

అసలేం జరిగిందంటే..?: టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత, స్టేడియంలోని ప్రేక్షకులను అలరించడానికి నిర్వాహకులు ఒక ప్రత్యేక లేజర్ షోను ఏర్పాటు చేశారు. అయితే ఈ షోలో భాగంగా ప్రదర్శించిన భారతదేశ మ్యాప్‌లో ఉత్తరాఖండ్‌తో పాటు ఈశాన్య భారత రాష్ట్రాలను పూర్తిగా విస్మరించారు. కేవలం సగం మ్యాప్‌ను మాత్రమే స్క్రీన్‌పై చూపించడంతో స్టేడియంలోని వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Also read-IPL: నేడు హోరాహోరీ మ్యాచ్‌…. గెలిస్తే క్వాలిఫయర్-2, ఓడితే ఇంటికే!

మండిపడుతున్న నెటిజన్లు: దేశ సార్వభౌమత్వానికి, భౌగోళిక సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్న ఈ విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్‌గా మారాయి. దీంతో క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఈ వివాదంపై ఐపీఎల్ యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News