HomeTop StoriesIbrahimpatnam: క్లాస్‌మేట్‌పైనే కన్నేసిన బీటెక్ విద్యార్థి.. మద్యం తాగించి మరీ!

Ibrahimpatnam: క్లాస్‌మేట్‌పైనే కన్నేసిన బీటెక్ విద్యార్థి.. మద్యం తాగించి మరీ!

Ibrahimpatnam: హైదరాబాద్‌ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తోటి ఇంజినీరింగ్ విద్యార్థినిని నమ్మించి మరీ అత్యాచారం చేశాడు. మద్యం తాగించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో నిందుతుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

నమ్మించి మరీ అత్యాచారం: ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఉడుతల ఉదయ్‌ అనే యువకుడు ఇబ్రహీంపట్నం పరిధిలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 14న రాత్రి తన క్లాస్‌మేట్‌ అయిన ఒక యువతిని టీ తాగడానికి అని చెప్పి కారులో దిల్‌సుఖ్‌నగర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ నుంచి తిరిగి ఇబ్రహీంపట్నం వస్తున్న క్రమంలో ఉదయ్ మద్యం కొనుగోలు చేశాడు. అనంతరం కారును బీడీఎల్‌ రోడ్డులోని ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి.. సదరు విద్యార్థినికి బలవంతంగా మద్యం తాగించాడు. ఆమె పూర్తిగా మత్తులోకి జారుకున్నాక.. ఇబ్రహీంపట్నంలోని ఒక గదికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Also read-Crime: తల్లిని చంపి ముంబై డాన్ అవ్వాలనుకున్నాడు.. రాజాం హత్య కేసులో సంచలన విషయాలు!

నిందితుడికి రిమాండ్: బాధితురాలు ఈ నెల 17న ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఉడుతల ఉదయ్‌ను సోమవారం అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మహేందర్‌రెడ్డి వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News