HomeTop StoriesSupreme Court: సుప్రీం కోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు.. త్వరలో ప్రమాణ స్వీకారం!

Supreme Court: సుప్రీం కోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు.. త్వరలో ప్రమాణ స్వీకారం!

Supreme Court: దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సులకు ఆమోదం తెలుపుతూ కేంద్ర న్యాయశాఖ సోమవారం అధికారిక నోటిఫికేషన్‌ వెలువరించింది. సుప్రీం కోర్టు జడ్జిలుగా నియమితులైన వారిలో నలుగురు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా, ఒకరు సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది కావడం విశేషం. కొలీజియం సిఫార్సులకు కేంద్రం ఆమోద ముద్ర వేయడంతో.. ఈ ఐదుగురు నూతన న్యాయమూర్తులు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

- Advertisement -

కొత్తగా నియమితులైన న్యాయమూర్తుల జాబితా:

  • సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది వి. మోహన (బార్ అసోసియేషన్ కోటా నుంచి ప్రత్యక్ష నియామకం)
  • జస్టిస్‌ శ్రీ చంద్రశేఖర్‌ (ప్రస్తుతం బాంబే హైకోర్టు సీజే)
  • జస్టిస్‌ షీల్‌ నాగు (ప్రస్తుత పంజాబ్‌ హరియాణా హైకోర్టు సీజే)
  • జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ్‌ (ప్రస్తుత మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీజే),
  • జస్టిస్‌ అరుణ్‌ పళ్లి (జమ్మూకశ్మీర్‌ హైకోర్టు సీజే)

రెండుకు పెరిగిన మహిళా జడ్జిల సంఖ్య: తాజా నియామకాల్లో సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది వి. మోహన నేరుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఈమె చేరికతో సుప్రీం కోర్టులో మహిళా జడ్జిల సంఖ్య రెండుకు చేరింది.

Also read-CDS: నూతన సీడీఎస్‌గా లెఫ్టినెంట్ జనరల్‌ రాజా సుబ్రమణి

వి. మోహన నేపథ్యం: న్యాయవాది మోహన 1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అనంతరం సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ఇందు మల్హోత్రా, సీఎస్‌ వైద్యనాథన్‌ల వద్ద జూనియర్‌గా వృత్తిపరమైన మెళకువలు నేర్చుకున్నారు. 1996లో ఏఓఆర్‌ (Advocate-on-Record) పరీక్ష పాసైన తర్వాత దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్వతంత్రంగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ప్రసిద్ధ సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌సిబల్, పి.చిదంబరం, అరుణ్‌ జైట్లీ, అంద్యార్జునలతో కలిసి వివిధ కీలక కేసుల్లో పనిచేశారు. న్యాయవ్యవస్థలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2015 ఏప్రిల్‌ 23న సుప్రీం కోర్టు ఆమెకు సీనియర్‌ న్యాయవాది హోదా కల్పించింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News