Monday, February 16, 2026
HomeTop StoriesHarish Rao: "కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే!".. హరీశ్ రావు...

Harish Rao: “కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే!”.. హరీశ్ రావు సెన్సేషనల్ కామెంట్స్!

SIT notices: తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు అందడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌పై బురద చల్లాలని చూడటం “సూర్యునిపై ఉమ్మి వేయడమే” అని ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.

- Advertisement -

చరిత్రను మలినం చేసే ప్రయత్నం: దశాబ్ద కాలం పాటు తెలంగాణను అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని అన్నారు. అలాంటి చరిత్రాత్మక నాయకుడిపై రాజకీయ కక్షతో కుతంత్రాలు సాగించడం సిగ్గుచేటని హరీశ్ రావు ఖండించారు. చరిత్రను సృష్టించిన వాడు కేసీఆర్ అయితే.. ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అని ఆయన ధ్వజమెత్తారు.

డైవర్షన్ పాలిటిక్స్: పరిపాలనలో వైఫల్యాలు, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ సిట్ నోటీసులని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ఈ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

మున్సిపల్ ఎన్నికల లబ్ధి: కేసీఆర్‌ను రాజకీయంగా వేధించడం ద్వారా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని హరీశ్ రావు విమర్శించారు.

Also read-Phone Tapping : ఫామ్‌హౌస్‌ గడపకు ‘సిట్’! ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు..

అహంకారంపై హెచ్చరిక: “అధికారం శాశ్వతం కాదు.. అహంకారం అంతకంటే కాదు” అని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News