House arrest: సనత్‌నగర్‌లోని టిమ్స్ (TIMS) ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎటువంటి అనుమతి లేదనే కారణంతో పోలీసులు కోకాపేటలోని ఆయన నివాసం వద్ద ఈ నిర్బంధాన్ని అమలు చేశారు. హరీశ్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
తలసాని, సబితా సైతం గృహనిర్బంధం: ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు హరీశ్‌రావు నివాసానికి చేరుకుని సంఘటనపై చర్చించారు. హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిలను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ ప్రాంతంలో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

