HomeTop StoriesMancherial: ఈదురుగాలులకు నలుగురు రైతులు మృతి

Mancherial: ఈదురుగాలులకు నలుగురు రైతులు మృతి

Mancherial: మంచిర్యాల జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. అకాల వర్షం, బలమైన ఈదురుగాలుల బీభత్సానికి గోడ కూలి నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తమ పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది.

- Advertisement -

ధాన్యం కుప్పలపై కవర్లు కప్పుతుండగా ప్రమాదం: లక్షెట్టిపేట పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తమ ధాన్యం కుప్పలపై కవర్లు కప్పుతుండగా.. సమీపంలోని గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను వెంకటేశ్, అభిరామ్, లచ్చన్న, నాగరాజుగా గుర్తించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

మరో నలుగురికి తీవ్ర గాయాలు: ఈ ఘటనలో మరో నలుగురు రైతులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన తోటి రైతులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట, కరీంనగర్ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News