Visakhapatnam: విశాఖలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం- అనకాపల్లి జాతీయ గండిగుండం సమీపంలో లారీని కారు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఒక బాలుడు కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
అతి వేగమే కారణం!: ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి ప్రమాదకారణాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. అయితే మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read-Crime: భర్తను హత్య చేసిన భార్య.. గుడికి వెళ్దామని తీసుకెళ్లి ఏం చేసిందో తెలుసా?

