HomeTop StoriesFuel Prices: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

Fuel Prices: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

Fuel Prices Increased Again: దేశవ్యాప్తంగా వాహనదారులపై ఇంధన ధరల భారం మళ్లీ పడింది. ప్రభుత్వరంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్‌పై రూ. 2.84, డీజిల్‌పై రూ. 2.86 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ఈ ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ధరల పెంపునకు గల కారణాలు: పశ్చిమాసియా సంక్షోభం: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వారం క్రితం వరకు దేశీయంగా ధరలను స్థిరంగా ఉంచాయి. అయితే దీనివల్ల కంపెనీలు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటుండటంతో భారాన్ని కొంతమేర వినియోగదారులపై వేయక తప్పలేదని అధికారులు పేర్కొంటున్నారు.

నాలుగోసారి లీటరుకు పెరిగిన ధరల వివరాలు:

  • పెట్రోల్: రూ. 2.84 పెంపు
  • డీజిల్: రూ. 2.86 పెంపు

10 రోజుల్లో 4వ సారి: సామాన్యుడిపై ఇంధన భారం రోజురోజుకూ ముదురుతోంది. గత పది రోజుల వ్యవధిలోనే ప్రభుత్వరంగ చమురు సంస్థలు పెట్రో ధరలను పెంచడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. దీంతో దిల్లీలో పెట్రోల్‌ ధర రూ.102.12కాగా డీజిల్‌ రూ.95.20కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.115.58 కాగా డీజిల్‌ ధర రూ.103.74గా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News