HomeTop StoriesGanesha in dreams: కలలో గణేశ నిమజ్జనం కనిపిస్తే సంకేతాలు ఇవే

Ganesha in dreams: కలలో గణేశ నిమజ్జనం కనిపిస్తే సంకేతాలు ఇవే

Lord Ganesha: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గణేశ్‌ నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.వినాయక చవితి మొదలుకుని ప్రతిరోజు ఓ పండుగలా ఊరువాడా అంతా ఏకమై ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం గణేశుడిని తొలి పూజ అందుకునే దేవుడిగా భావిస్తారు.

- Advertisement -

ఈ సందర్భంలో గణేశుడికి సంబంధించిన కొన్ని దృశ్యాలు కలలో కనిపిస్తే వాటిని స్వప్న శాస్త్ర విశ్వాసాల ప్రకారం కొన్ని సంకేతాలుగా పండితులు చెబుతుంటారు.

కలలో గణేశుడు కనిపిస్తే..

సాధారణంగా కలలో గణేశుడు కనిపిస్తే అది మంచి సూచనగా పండితులు చెబుతారు. ముఖ్యంగా గణేష్ ఉత్సవాల సమయంలో గణపతి దర్శనం కలలో రావడం లేదా పూజ చేస్తున్నట్లు కనిపించడం త్వరలో శుభవార్తలు వినే అవకాశాలున్నట్లు పండితులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఇలాంటి కల రావడం మరింత శుభప్రదమని కూడా నమ్మకం ఉంది. కోరుకున్న విషయాలు నెరవేరే అవకాశాలున్నాయని కూడా పండితులు వివరిస్తున్నారు.

కలలో గణేశుడి విగ్రహం కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరిగే సూచనగా భావిస్తారు. చాలా రోజులుగా ఆగిపోయిన పని ముందుకు సాగే సమయం వచ్చిందని కూడా స్వప్న శాస్త్ర విశ్వాసాలు చెబుతున్నాయి.

అలాగే గణపతితో పాటు ఆయన వాహనం ఎలుక కనిపించడం కూడా శుభసంకేతంగా పరిగణిస్తారు. ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర ప్రయత్నాల్లో విజయంతో పాటు ఆర్థిక లాభాలకు ఇది సూచనగా భావిస్తారు.

గణేశుడి నిమజ్జనం కలలో…

అయితే గణేశుడి నిమజ్జనం కలలో కనిపిస్తే మాత్రం దీనిని సాధారణంగా శుభసూచకంగా చూడరు. ఇలాంటి కలలు జీవితంలో ఇబ్బందులు, బాధ లేదా ఆర్థిక సమస్యలకు సంకేతాలుగా స్వప్న శాస్త్రంలో పేర్కొంటారు.

Also Read:Konda Surekha’s Chamber: కొండా సురేఖ ఛాంబర్‌కు తాళం.. సచివాలయంలో నేమ్‌బోర్డు తొలగింపు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News