Goa: మన దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా టూరిస్టులు ఎక్కువ మంది సందర్శించే ప్రాంతాల్లో గోవా ఎప్పుడు ముందు స్థానాల్లోనే ఉంటుంది. గోవా ఎప్పుడూ కూడా పర్యాటకులతో సందడి సందడిగా ఉంటుంది.గోవాలోని బీచ్, హోటళ్లు నిత్యం సందర్శకులతో,టూరిస్టులతో నిండి ఉంటాయి.
అయితే తాజాగా గోవా బీచ్ కి సంబంధించి అక్కడి అధికారులు కొన్ని రూల్స్ ని టూరిస్టుల ముందుకు తీసుకుని వచ్చారు.గోవాలో ఇక నుంచి పొరపాటున కూడా ఓ పది పనులు చేయకూడదనే రూల్ ని పాస్ చేశారు.పొరపాటున ఆ పది పనులను కానీ చేశారో..ఒక జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే అని ముందుగానే హెచ్చరికలు కూడా జారీ చేశారు.
అక్కడ చేయకూడని పనులు ఏంటంటే..
ఇకనుంచి బీచ్ ల్లో పార్టీలు చేసుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. అంతేకాకుండా పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చే సౌండ్ బాక్స్ లను కానీ,డీజేలను కానీ ఉపయోగించకూడదు.
బీచ్ లో పర్మిషన్ లేని, అర్హత లేని గైడ్ లను కానీ ,మసాజర్ లను కానీ నియమించుకోకూడదు.తెలియని వారిని నమ్మి పని ఇవ్వడంవల్ల వారు లేనిపోని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలున్నాయని..అధికారలు ఈ నియమాన్ని అమలు చేయనున్నారు.
అనధికారిక కౌంటర్ల నుండి క్రూయిజ్ లేదా వాటర్ స్పోర్ట్స్ టిక్కెట్లను కొనడం.
అనుమతింలేని జోన్‌లలో ఇక మీదుట మద్యం సేవించకూడదు.
బీచ్ ఒడ్డున కానీ,పరిసర ప్రాంతాల్లో కానీ ఇసుకపై గాజు సీసాలను పగలగొట్టడం వంటి పనులు చేయరాదు.
నిర్దేశించిన ప్రదేశాల వెలుపల వంట చేయడం. దీని అర్థం, బీచ్ బోన్‌ఫైర్‌లు, రోడ్డు పక్కన వంటలు చేయడం ఇప్పుడు చట్టవిరుద్ధం. వంట కేవలం గుర్తించిన, అనుమతి ఇచ్చిన జోన్‌లలో మాత్రమే చేయాలి.
బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయడం.
అనధికారిక నదీ విహారాలు, వాటర్ స్పోర్ట్స్.
అత్యవసర, లైఫ్‌గార్డ్ లేదా బీచ్ శుభ్రపరిచే వాహనాలకు అడ్డుపడటం, లేదా ఇసుకపై వాహనాలు నడపడం. పర్యాటకులు తమ వాహనాలను బీచ్‌కు దూరంగా ఉంచాలి.
బీచ్ సమీపంలో వ్యర్థాలు, మురుగునీరు, రసాయనాలు లేదా నూనెను పారవేయడం. ఈ కొత్త నియమం వ్యక్తులకు మాత్రమే కాకుండా వ్యాపారాలకు కూడా వర్తిస్తుంది.
Also Read: Brij Bhushan: లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్

