Wednesday, February 11, 2026
HomeTop StoriesGold Rate: పండగ అవ్వగానే తిరిగి పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్

Gold Rate: పండగ అవ్వగానే తిరిగి పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్

Gold Price Today: సంక్రాంతి ముగియగానే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు మళ్లీ తిరిగి పుంజుకున్నాయి. అందరూ రేట్లు తగ్గుతాయ్ అనుకుంటే అనూహ్యంగా పెరగటంపై ఆందోళనలు ఉన్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు తమ ప్రాంతంలో తాజా రేట్లను గమనించటం చాలా ముఖ్యం.

- Advertisement -

గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త ఏడాదిలో అంతర్జాతీయ పరిణామాలు మెల్లగా కొలిక్కి వచ్చేందుకు ప్రయత్నాలు జరిగితే ధరలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

also read Mahalaxmi Raja Yoga: మకరంలో మహాలక్ష్మి రాజయోగం.. ఈ రాశుల వారికి

శనివారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.14,378 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.13,180 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.3 లక్షల 10 వేల వద్ద ఉంది.

ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.14,487, ముంబైలో రూ.14,378, దిల్లీలో రూ.14,393, కలకత్తాలో రూ.14,378, బెంగళూరులో రూ.14,378, కేరళలో రూ.14,378 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.13,280, ముంబైలో రూ.13,180, దిల్లీలో రూ.13,195, కలకత్తాలో రూ.13,180, బెంగళూరులో రూ.13,180, కేరళలో రూ.13,180గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News