Wednesday, January 14, 2026
HomeTop StoriesGold Rate: భారీగా పెరిగిన బంగారం, వెండి.. బాబోయ్ సంక్రాంతి షాపింగ్ కలేనా..

Gold Rate: భారీగా పెరిగిన బంగారం, వెండి.. బాబోయ్ సంక్రాంతి షాపింగ్ కలేనా..

Gold Price Today: అబ్బే ఈ సారి సంక్రాంతికి బంగారం, వెండి లాంటివి అస్సలు కొనేలా లేవమ్మా. జేబులో డబ్బులకు వాటి రేట్లకి అస్సలు మ్యాచింగ్ కనిపించటం లేదమ్మా.. ఇది సామాన్య మధ్యతరగతి భారతీయుడి ఆవేదన. అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు, చాలా దేశాల్లో ఉద్రిక్తతల కారణంగా గోల్డ్, సిల్వర్ రేట్లు అస్సలు తగ్గటమే లేదు. అయితే ఇవాళ షాపింగ్ చేయాలనుకుంటున్న వారు ముందుగా పెరిగిన రేట్లను పరిశీలించటం చాలా ముఖ్యం.

- Advertisement -

గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త ఏడాదిలో అంతర్జాతీయ పరిణామాలు మెల్లగా కొలిక్కి వచ్చేందుకు ప్రయత్నాలు జరిగితే ధరలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

also read Ap: పల్లెకు బయల్దేరిన పట్టణం…హైవే పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌!

శనివారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.14,046 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.12,875 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.2 లక్షల 75 వేల వద్ద ఉంది.

ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.13,965, ముంబైలో రూ.14,046, దిల్లీలో రూ.14,061, కలకత్తాలో రూ.14,046, బెంగళూరులో రూ.14,046, కేరళలో రూ.14,046 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.12,900, ముంబైలో రూ.12,875, దిల్లీలో రూ.12,890, కలకత్తాలో రూ.12,875, బెంగళూరులో రూ.12,875, కేరళలో రూ.12,875గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News