Gold Price Today: వెండితో పోటీలో తాను అస్సలు వెనకపడటం లేదని బంగారం నిరూపించుకుంటోంది. నిన్నటి వరకూ బంగారాన్ని మించి వెండి పెరుగుతోందని అన్న మాటను తప్పుగా నిరూపిస్తోంది. ఎందుకంటే జనవరి 20 కంటే నేడు పసిడి రేటు రూ.5వేలు 10 గ్రాములకు పెరగటంతో నోరెళ్లబెడుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఈ క్రమంలో ఎవరైనా షాపింగ్ చేయాలని అని భావిస్తున్నట్లయితే ముందుగా తమ ప్రాంతంలోని రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం చాలా ముఖ్యం.
గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త ఏడాదిలో అంతర్జాతీయ పరిణామాలు మెల్లగా కొలిక్కి వచ్చేందుకు ప్రయత్నాలు జరిగితే ధరలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
also read Health: ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? అయితే మీ హెల్త్!
బుధవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.15,480 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.14,190 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.3 లక్షల 40 వేల వద్ద ఉంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.15,546, ముంబైలో రూ.15,480, దిల్లీలో రూ.15,495, కలకత్తాలో రూ.15,480, బెంగళూరులో రూ.15,480, కేరళలో రూ.15,480 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.14,250, ముంబైలో రూ.14,190, దిల్లీలో రూ.14,205, కలకత్తాలో రూ.14,190, బెంగళూరులో రూ.14,190, కేరళలో రూ.14,190గా ఉన్నాయి.

