HomeTop StoriesIPL-2026: సీఎస్‌కే అభిమానులకు గుడ్ న్యూస్.. నెట్స్‌లోకి ధోని ఎంట్రీ!

IPL-2026: సీఎస్‌కే అభిమానులకు గుడ్ న్యూస్.. నెట్స్‌లోకి ధోని ఎంట్రీ!

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్‌న్యూస్‌. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ఎంఎస్ ధోని గాయం కారణంగా రెండు వారాల పాటు దూరం అవుతాడన్న వార్తతో నిరాశలో ఉన్న అభిమానులకు ఇప్పుడు ఊరట లభించింది. ధోని మైదానంలోకి అనుకున్న దానికంటే ముందుగానే అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

నెట్స్‌లో ధోని మెరుపులు: తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ధోని తన కిట్ బ్యాగ్ పట్టుకుని నెట్స్‌లో ప్రాక్టీస్‌కు వెళ్తుండటం కనిపించింది. గాయం తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఆయన మళ్లీ బ్యాట్ పట్టడం విశేషం. దీంతో ఆయన కనీసం నాలుగైదు మ్యాచ్‌లకు దూరం అవుతాడన్న ప్రచారానికి తెరపడినట్లయింది.

పంజాబ్‌తో తలపడనున్న సీఎస్‌కే: ఈ మెగా లీగ్‌లో చెన్నైకి శుభారంభం లభించలేదు. మొదటి మ్యాచ్‌లోనే రాజస్థాన్ రాయల్స్ చేతిలో సీఎస్‌కే పరాజయం పాలైంది. అయితే తదుపరి పోరులో శుక్రవారం సొంత మైదానం (చెన్నై)లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ జరగనుంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో ధోని ఆడతాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ ప్రాక్టీస్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకపోతే మూడో మ్యాచ్ నాటికైనా థాలా.. తుది జట్టులోకి రావడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.షెడ్యూల్ ప్రకారం రెండు వారాల్లో చెన్నై నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ధోని నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టడంతో.. ఆయన త్వరలోనే మైదానంలో హెలికాప్టర్ షాట్లతో అలరిస్తాడని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News