Friday, February 13, 2026
HomeTop StoriesHolidays: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. పెరిగిన సంక్రాంతి సెలవులు.. జాబితా ఇదే!

Holidays: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. పెరిగిన సంక్రాంతి సెలవులు.. జాబితా ఇదే!

Sankranti holidays: పాఠశాల విద్యార్థులకు రేవంత్‌ సర్కార్‌ తీపి కబురు అందించింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవులను భారీగా పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖ గత మే నెలలో జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు.. ఐదు రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది. అయితే ఈ నిర్ణయాన్నీ పునఃసమీక్షించి, వరుసగా వస్తున్న సెలవులను కలుపుతూ మొత్తం 9 రోజుల పాటు సెలవులు రానున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరిస్తామని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో విద్యార్థులు పండుగ ఆనందాలను పూర్తిగా ఆస్వాదించే అవకాశం దక్కింది.

- Advertisement -

సెలవుల వివరాలు ఇవే:

  • జనవరి 10: రెండో శనివారం
  • జనవరి 11: ఆదివారం
  • జనవరి 12 – 16: సంక్రాంతి సెలవులు (భోగి, సంక్రాంతి, కనుమతో కలిపి)
  • జనవరి 17: శనివారం (పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉన్నా, ప్రయాణ సౌలభ్యం దృష్ట్యా పొడిగింపు యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం)
  • జనవరి 18: ఆదివారం
  • జనవరి 19 (సోమవారం): పాఠశాలలు తిరిగి ప్రారంభం.

సెలవులు పెరగడానికి కారణం: వాస్తవానికి విద్యాశాఖ గత మే నెలలో విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 15 వరకు ఐదు రోజులు మాత్రమే సెలవులు ఇవ్వాలని భావించింది. అయితే, జనవరి 10 రెండో శనివారం రావడం, పండుగ తర్వాత 18న ఆదివారం ఉండటంతో సెలవుల సంఖ్య పెరిగింది. గతేడాది సంక్రాంతి పండుగ కోసం కేవలం 6 రోజులు మాత్రమే సెలవులు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం అది 9 రోజులకు చేరడం విద్యార్థులకు, తల్లిదండ్రులకు పెద్ద ఊరటగా మారింది.

Also read- Cold wave: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31 తర్వాత తగ్గనున్న చలి తీవ్రత!

పల్లెబాట పట్టనున్న విద్యార్థులు: సుదీర్ఘ సెలవులు లభించడంతో విద్యార్థులు తమ సొంత గ్రామాలకు వెళ్లి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. పల్లెల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతాయి. కాబట్టి ఈ అదనపు సెలవులు పిల్లలకు పండుగ ఆనందాన్ని రెట్టింపు చేయనున్నాయి. దీనిపై విద్యాశాఖ త్వరలోనే అధికారిక ఉత్తర్వులను జారీ చేయనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News