HomeTop StoriesGST: రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. జూన్‌లో 13.9 శాతం వృద్ధి!

GST: రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. జూన్‌లో 13.9 శాతం వృద్ధి!

GST: దేశంలో వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి రికార్డును సృష్టించాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గడచిన జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు 13.9 శాతం వృద్ధిని నమోదయ్యింది. దీంతో జీఎస్టీ వసుళ్లు రూ.1.95 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధి పథంలో సాగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

వసూళ్ల వివరాలు: దేశీయంగా జరిగిన వ్యాపార లావాదేవీల ద్వారా వచ్చిన స్థూల వసూళ్లు 6.5 శాతం పెరిగి రూ.1.35 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అలాగే దిగుమతుల విభాగంలో జీఎస్టీ వసూళ్లు భారీ వృద్ధిని సాధించాయి. గతంతో పోలిస్తే ఇది ఏకంగా 34.6 శాతం పెరిగి రూ.60,038 కోట్లకు చేరింది. రీఫండ్లు పోను జూన్ నెలకు గాను నికర జీఎస్టీ వసూళ్లు 11.2 శాతం వృద్ధితో రూ.1.62 లక్షల కోట్లకు పైగా నమోదయ్యాయి. పండుగల సీజన్ ముగిసినప్పటికీ, దేశీయంగా వినియోగం పెరగడం మరియు పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేయడం వల్లే దిగుమతులు, దేశీయ లావాదేవీల్లో ఈ స్థాయిలో వృద్ధి సాధ్యమైందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ దూకుడు రాబోయే త్రైమాసికాలలోనూ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Also read-AMB Cinemas: మహేష్‌ బాబుకు భారీ షాక్‌.. రూ. 1.1 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశం.. కారణం ఏంటంటే..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News