HomeTop StoriesGummadidala:గుమ్మడిదలలో ప్లాస్టిక్ నిషేధం విధించాలి

Gummadidala:గుమ్మడిదలలో ప్లాస్టిక్ నిషేధం విధించాలి

– ప్రమాదకర అనారోగ్యాలను అరికట్టాలని డిమాండ్
– ఆహార పదార్థాలు, టీ హోటళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి
– మున్సిపాలిటీ వ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించాలి

- Advertisement -

జిన్నారం, ( తెలుగు ప్రభ ):పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిన ప్లాస్టిక్ వాడకాన్ని తక్షణమే అరికట్టాలని, మున్సిపాలిటీ వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో, చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ సమావేశంలో ఈ అంశంపై ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడంతో డ్రైనేజీలు పూడిపోయి పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హోటళ్లు, చాయ్ కొట్లు, తినుబండారాల దుకాణాల్లో వేడి ఆహార పదార్థాలు, టీని ప్లాస్టిక్ కవర్లు, కప్పుల్లో అందించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

వ్యాపార సముదాయాల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి, నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్పరిణామాలపై మున్సిపాలిటీ వ్యాప్తంగా ప్రజలకు, వ్యాపారులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News