HomeTop StoriesHarish Rao: కళ్లెదుట గోదావరి నీళ్లున్నా.. మోటార్లు ఆన్ చేయని రేవంత్‌ సర్కార్‌

Harish Rao: కళ్లెదుట గోదావరి నీళ్లున్నా.. మోటార్లు ఆన్ చేయని రేవంత్‌ సర్కార్‌

నర్సాపూర్, (తెలుగుప్రభ): కాంగ్రెస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కాగజ్ మద్దూర్ గ్రామంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు , స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సమక్షంలో పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..సాధారణంగా ఎవరైనా ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి వెళ్తారు.

- Advertisement -

కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆ పార్టీ ఖాళీ అవుతోందంటే వారి పని అయిపోయిందని అర్థమని విమర్శించారు.కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదని ప్రజలకు అర్థమైపోయిందన్నారు.ఊళ్లలో కాంగ్రెస్ వాళ్లమని చెప్పుకోవడానికే నాయకులు భయపడుతున్నారని..కేసీఆర్ గారు వేసిన రోడ్లకు గుంతలు పడితే కనీసం డాంబర్ వేసి పూడ్చే తెలివి ఈ ప్రభుత్వానికి లేదన్నారు.కాగజ్ మద్దూర్ రోడ్లకు మోకాలి లోతు గుంతలు పడి గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు.

నీ ఇంటెలిజెన్స్ ఎంతసేపు ప్రతిపక్షాల మీదేనా?…

ప్రజల రోడ్లకు గుంతలు పూడ్చమంటే పైసలు లేవంటారు కానీ.. మనుషులు, ఊరు, వాడ లేని ఫ్యూచర్ సిటీ దగ్గర మాత్రం పదివేల కోట్లు పెట్టి ఆరు వరుసల రోడ్లు వేస్తున్నారని విమర్శించారు.సీఎం అనుయాయుల భూముల ధరలు పెంచుకోవడానికేనా ఈ ఫ్యూచర్ సిటీ రోడ్లు అని రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నానని… నీ ఇంటెలిజెన్స్ ఎంతసేపు ప్రతిపక్షాల మీదేనా? ఈ గుంతల రోడ్ల మీద లేదా? అని ప్రశ్నించారు. మంత్రుల నియోజకవర్గాల్లోనే రోడ్లకు దిక్కులేదని ప్రజలు వచ్చి మొరపెట్టుకుంటున్నారు.

కేసీఆర్ ఉన్నప్పుడు నర్సాపూర్-హైదరాబాద్, నర్సాపూర్-మెదక్ రోడ్లను ఎంత అద్భుతంగా డబుల్ లైన్ చేశారో అందరూ చూశారన్నారు.
ఎన్నికల ముందు 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఇస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఊరూరు తిరిగారు. వంద రోజులు పోయి వెయ్యి రోజులు దాటుతున్నా ఆ బాండ్ పేపర్లకు దిక్కులేదన్నారు.బాండ్ పేపర్ కు ఉండే ఇజ్జత్ కూడా కాంగ్రెస్ వాళ్లు తీసేశారు. బాండ్లను బొందపెట్టి, గ్యారెంటీలకు గోరీ కట్టారని గుర్తు చేశారు.

ఒక్కో అవ్వకు రేవంత్ రెడ్డి రూ. 68 వేలు బాకీ…

అవ్వలకు నెలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారని…పెంపు లేదు సరికదా నెలకు 2 వేల చొప్పున లెక్కేసుకున్నా 34 నెలలకు ఒక్కో అవ్వకు రేవంత్ రెడ్డి రూ. 68 వేలు బాకీ పడ్డాడని తెలిపారు.కాంగ్రెస్ వాళ్లు కనబడితే అవ్వలు ఆ బాకీ డబ్బులు నిలదీసి అడగాలన్నారు.. రైతుబంధు రూ. 15 వేలు ఇస్తామని చెప్పి, కేసీఆర్ ఇచ్చే పదివేలు కూడా ఇవ్వకుండా మూడు సీజన్ల పాటు ఎగ్గొట్టి రైతులను నట్టేట ముంచారు. తడిగుడ్డతో గొంతు కోసే రకం రేవంత్ రెడ్డి అని ప్రజలు ఇప్పుడు గ్రహిస్తున్నారన్నారు.
రామాయంపేట రైతులు తనకు ఫోన్ చేసి.. కరెంటు లేక పంటలు ఎండుతున్నాయని, మోటార్లు కాలుతున్నాయని రోడ్డెక్కి ధర్నా చేస్తున్నామని, అక్కడికి రమ్మని పిలిచారన్నారు.

Also Read:MLC: కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబం నాలుగు తరాలుగా విధేయులం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News