Health benefits : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సవాలుగా మారింది. ఖరీదైన రసాయన పానీయాల కంటే వంటింట్లో దొరికే సహజ పదార్థాలతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఉసిరి (Amla), జీలకర్ర (Jeera) కలిపిన నీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. శరీరంలోని విషతుల్యాలను (Toxins) బయటకు పంపి.. అంతర్గత అవయవాలను శుభ్రపరచడంలో ఈ డిటాక్స్ డ్రింక్ అద్భుతంగా పనిచేస్తుంది.





