HYDRA: హైదరాబాద్‌లో రాత్రి 10:30 గంటల నుంచి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హైడ్రా (HYDRAA) యంత్రాంగం అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ క్షేత్రస్థాయిలో ఉండి సేవలు అందించింది. నగరవ్యాప్తంగా వరద ముప్పు ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో హైడ్రా డీఆర్‌ఎఫ్ (DRF), ఎంఆర్‌టీ (MRT) బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. రహదారులపై భారీగా నిలిచిపోయిన వరద నీటిని ఎప్పటికప్పుడు సాఫీగా మళ్లించేందుకు హెవీ మోటార్లను ఉపయోగించి నీటిని తోడివేశారు.
అధికారుల పర్యవేక్షణ: వర్షం ప్రభావం మరియు క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ హైడ్రా అధికారులు సిబ్బందికి తగిన సూచనలు జారీ చేశారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య స్వయంగా క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలిస్తూ సిబ్బందికి తగు సూచనలు అందజేశారు. వారితో పాటు ఆర్ఎఫ్‌ఓ (RFO) జయప్రకాష్, డీఎఫ్‌ఓ (DFO) శ్రీధర్, డీఎఫ్‌ఓ గౌతం మరియు హైడ్రా ఎస్‌ఎఫ్‌ఓలంతా అర్ధరాత్రి వేళ కూడా గ్రౌండ్‌లోనే ఉండి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తతతో చేపట్టిన వెనువెంటనే సహాయక చర్యల కారణంగా నగరంలో త్వరగానే సాధారణ పరిస్థితులు నెలకొనేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
Also Read-Hyderabad: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన.. ఆరెంజ్ అలర్ట్ జారీ!

