HomeTop StoriesHeavy rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు

Heavy rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు

Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌,పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, రాయదుర్గం, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

- Advertisement -

సిర్పూర్ భారీ వర్షం: మరోవైపు రాష్ట్రంలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలుచోట్ల భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)లో అత్యధికంగా 10.1 సెం.మీ వర్షం పడింది. కట్టంగూరు – నల్గొండ జిల్లాలోని కట్టంగూడలో 8.2 సెం.మీ, నిజామాబాద్ రూరల్‌లోని మల్కాపూర్‌లో 8.1 సెం.మీ వర్షం పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

Also Read-Heavy rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News