HomeTop StoriesRains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు..ఎల్లో అలర్ట్‌ జారీ

Rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు..ఎల్లో అలర్ట్‌ జారీ

Ap Rains: ఏపీ,తెలంగాణ వాసులకు వాతావరణశాఖ బిగ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మంగళవారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని హెచ్చరికలు జారీ చేసింది.ఏపీలో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. రానున్న మూడు గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -

తేలికపాటి నుండి చెదురుమదురు..

విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా గజపతినగరం, శృంగవరపుకోట, భీమునిపట్నం పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాగే అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేస్తూ తేలికపాటి నుండి చెదురుమదురు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశముందని అధికారులు వివరించారు.

దక్షిణ అంతర్గత కర్ణాటక, పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న తీర ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలపై సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడ్రోజుల పాటు వానలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Also Read:Srisailam:నిండుకుండలా శ్రీశైలం జలాశయం

తెలంగాణలో అనేకచోట్ల రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News