HomeTop StoriesTelangana: కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. సీనియర్లకు చెక్ పెట్టనున్న రేవంత్ రెడ్డి!

Telangana: కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. సీనియర్లకు చెక్ పెట్టనున్న రేవంత్ రెడ్డి!

Telangana Cabinet: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనతో పాటు మంత్రివర్గంలో సైతం భారీ మార్పులు జరుగనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తనదైన ముద్రను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో.. పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంలోనూ సమూల మార్పులు చేసేందుకు అధిష్టానం వద్ద సీఎం పావులు కదిపినట్లు సమాచారం. దీనికి దిల్లీ పెద్దల నుంచి సైతం సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

సీనియర్ల స్థానంలో యువరక్తం!: ప్రస్తుత మంత్రివర్గంలోని కొందరు సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రి నిర్ణయాలకు ఆశించిన స్థాయిలో సహకరించడం లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రజాపాలనను మరింత వేగవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి యంగ్ అండ్ డైనమిక్ లీడర్లపై దృష్టి పెట్టారు. కొత్త తరం ఆలోచనలతో దూసుకుపోయే యువ నాయకులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు తదితరుల శాఖల్లో మార్పులు లేదా కొందరికి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

పీసీసీ పగ్గాలు ఎవరికి?: ప్రభుత్వంతో పాటు పార్టీలోనూ ప్రక్షాళన చేపట్టేందుకు అధిష్టానం సిద్ధమైంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేశ్‌ కుమార్ గౌడ్ స్థానంలో కొత్త తరం నాయకుడికి బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లిన చరిత్ర ఉండి.. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడిన ఇద్దరు యువ నేతల పేర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు సమాచారం. సీఎంకు అత్యంత నమ్మకస్తులైన ఈ ఇద్దరిలో ఒకరికి పీసీసీ పగ్గాలు దక్కే అవకాశం ఉంది.

Also read-Telangana cabinet: సీఎం రేవంత్‌ షాకింగ్‌ నిర్ణయం.. యాదాద్రిలో కేబినెట్‌ మీటింగ్‌.. ఎందుకంటే?

జూన్ 2 లోపే కీలక నిర్ణయం!: యువ నేతలకు పెద్దపీట వేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే భారీ మార్పులకు సీఎం రేవంత్‌ సిద్ధమైనట్లు తెలుస్తుంది. కాంగ్రెస్‌లోని పలువురు నేతల నుండి అందిన సమాచారం ప్రకారం.. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 లోపే ఈ ప్రక్షాళన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పార్టీ, ప్రభుత్వాల్లో ఒకేసారి జరగబోయే ఈ భారీ మార్పులు కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News