Bandi Bhagirath: పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా సాగాయి.
మధ్యంతర బెయిల్ ఇవ్వలేమన్న హైకోర్టు: భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆయనను అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
Also read-CM Revanth: పారిపోవడం తప్పు.. కుమారుడిని అప్పగిస్తేనే మంచిది.. బండి సంజయ్‌కి సీఎం సూచన
వచ్చే గురువారం తుది తీర్పు: ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తదుపరి విచారణలో ఈ పిటిషన్‌పై తుది తీర్పును వెల్లడిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే వచ్చే గురువారం ఈ కేసులో హైకోర్టు తన తుది ఉత్తర్వులను వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

