HomeTop StoriesAICC: నేడు ఏఐసీసీ అత్యవసర సమావేశం.. పీసీసీ చీఫ్‌లతో భేటీకానున్న ఖర్గే!

AICC: నేడు ఏఐసీసీ అత్యవసర సమావేశం.. పీసీసీ చీఫ్‌లతో భేటీకానున్న ఖర్గే!

Mallikarjun Kharge: మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేడు ఏఐసీసీ ఉన్నత స్థాయి భేటీ జరగనుంది. దేశంలో మారుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దిల్లీలో జరిగే ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) అధ్యక్షులతో పాటు.. ఆయా రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌లు హాజరుకానున్నారు.

- Advertisement -

ప్రధాన ఎజెండా అంశాలివే: రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న వేళ.. హఠాత్తుగా ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో నెలకొన్న అంతర్గత సంక్షోభం, దానివల్ల తలెత్తే రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ రెండు ప్రధాన పరిణామాలతో పాటు.. వివిధ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై అధిష్ఠానం పీసీసీ చీఫ్‌లు, ఇన్‌ఛార్జ్‌లకు దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News