HomeTop StoriesChittoor: భార్యను వ్యభిచార కూపంలోకి నెట్టిన భర్త.. రోజుకు రూ.5 వేలు తేవాలంటూ టార్చర్!

Chittoor: భార్యను వ్యభిచార కూపంలోకి నెట్టిన భర్త.. రోజుకు రూ.5 వేలు తేవాలంటూ టార్చర్!

Prostitution: ఏపీలోని చిత్తూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. డబ్బే పరమావధిగా భావించి ఓ వ్యక్తి తన భార్యను వ్యభిచార కూపంలోకి నెట్టాడు. అంతటితో ఆగకుండా ప్రతిరోజూ నిర్దేశిత మొత్తాన్ని సంపాదించాలంటూ ఆమెను దారుణంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

భార్యను వ్యభిచార కూపంలోకి దించిన భర్త: పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు పట్టణానికి చెందిన రాజేష్, మమతలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. మొదట్లో రాజేష్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అయితే ఆటో ద్వారా ఆశించినంత సంపాదన రాకపోవడంతో. త్వరగా డబ్బు సంపాదించి జీవితంలో స్థిరపడవచ్చనే ఆశ చూపి భార్యను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించాడు. మొదట పుత్తూరులోని ఒక మహిళ ఇంట్లో భార్యను ఉంచి.. ప్రతిరోజూ రూ.3 వేలు తీసుకుంటూ వ్యభిచారానికి వదిలేసేవాడు. ఆ తర్వాత ఎక్కువ లాభాల కోసం తానే సొంతంగా ఒక ఇల్లు అద్దెకు తీసుకుని భార్యతో ఈ దందా నిర్వహించడం ప్రారంభించాడు. రోజురోజుకూ భర్త వేధింపులు మితిమీరడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అనంతరం మీడియా ముందు తన ఆవేదనను పంచుకుంది. “త్వరగా స్థిరపడదామని చెప్పి నన్ను ఈ నరకంలోకి నెట్టాడు. గత 10 ఏళ్లుగా వ్యభిచారం ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని అతడికే అప్పగించాను. కానీ ఈ మధ్య కాలంలో ప్రతిరోజూ రూ.5 వేలు సంపాదించి తీరాలని కండిషన్ పెట్టాడు. నేను ఎక్కడ అతడిని వదిలేసి వెళ్లిపోతానోననే భయంతో నా ప్రమేయం లేకుండా వీడియోలు తీసేవాడు.” అని బాధితురాలు కన్నీరు మున్నీరైంది.

Also read-Suicide: వాట్సప్ స్టేటస్ చూసి భార్య ఆత్మహత్య.. ఆసుపత్రిలో భర్త !

అనుమానంతో దాడులు: వ్యభిచారం చేయిస్తూనే భార్య ఎవరితోనైనా మాట్లాడితే రాజేష్ తీవ్రంగా అనుమానించేవాడు. ఆమెపై దారుణంగా దాడి చేస్తూ టార్చర్ పెట్టేవాడు. విటులుగా వచ్చేవారిపై కూడా దాడికి యత్నించేవాడు. భర్త వేధింపులను భరించలేక, ప్రాణభయంతో బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చిత్తూరు పోలీసులు నిందితుడు రాజేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News