HomeTop StoriesWife harassment: నా భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నా.. కారుణ్య మరణానికి అనుమతివ్వండి!

Wife harassment: నా భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నా.. కారుణ్య మరణానికి అనుమతివ్వండి!

Mercy killing: భార్యల బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఇటీవల ఇలాంటి వార్తాలు తరచుగా వింటూనే ఉన్నాం. అయితే తాజాగా ఓ భర్త తన భార్య పెట్టే వేధింపులను భరించలేక మరణాన్ని కోరుకున్నాడు. కారుణ్య మరణానికి అనుమతివ్వండని ఏకంగా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశాడు. భర్త పెట్టుకున్న అర్జీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది?.. ఎందుకు అతను మరణాన్ని కోరుకుంటున్నాడు అనే అంశాలను తెలుసుకుందాం!

- Advertisement -

అసలేం జరిగిందంటే: గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన కిరిట్‌ పటేల్‌ అనే వ్యక్తికి 2024లో స్థానిక మహిళతో వివాహం జరిగింది. ఇద్దరికీ ఇది మూడో పెళ్లి కావడం గమనార్హం. అయితే పెళ్లయిన కొన్ని రోజులు వీరి బంధం అన్యోన్యంగా సాగింది. ఆ తరువాతే అసలు కథ మొదలైంది. భార్య, అత్త కలిసి డబ్బు కోసం తనను తీవ్రంగా ఒత్తిడి చేస్తూ.. మానసికంగా చంపేస్తున్నారని పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు.

చట్టాలను దుర్వినియోగం చేస్తోంది: బాధిత భర్త కలెక్టర్‌కు రాసిన లేఖలో పలు సంచలన విషయాలను పేర్కొన్నారు. తన భార్యకు గతంలో పెళ్లయిన ఇద్దరు వ్యక్తులను కూడా ఇలాగే వేధించిందని తెలిపారు. వారి నుంచి సైతం భారీగా డబ్బులు వసూలు చేసిందని పటేల్ ఆరోపించారు. మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను అడ్డం పెట్టుకుని.. తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని పేర్కొన్నారు. ఈ వేధింపులపై తాను పోలీసులను ఆశ్రయించినప్పటికీ వారు తన ఫిర్యాదును పట్టించుకోలేదని లేఖలో వాపోయారు. “భార్య, అత్త పెట్టే టార్చర్‌తో రోజుచస్తూ బతుకుతున్నా. తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నా. గృహ హింస ఎదుర్కొంటున్న పురుషులకు మన దేశంలో చట్టపరమైన రక్షణ కరువైంది. అందుకే నన్ను కారుణ్య మరణానికి అనుమతించండి” అని కిరిట్ పటేల్ కలెక్టర్‌ను వేడుకున్నారు.

Also Read-Crime: భర్తను చంపిన భార్య.. ఎందుకో తెలుసా?

ఇంకా స్పందించని అధికారులు: పురుషుల హక్కులు, చట్టాల దుర్వినియోగంపై సరికొత్త చర్చకు దారితీసిన ఈ కారుణ్య మరణ అభ్యర్థన లేఖపై జిల్లా యంత్రాంగం ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ వ్యవహారంపై కలెక్టరేట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే ఈ అంశం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. పెళ్లి చేసుకోకపోవడమే ఉత్తమం అని అంటున్నారు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News