Heavy rains: తెలంగాణ వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజులు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి చిరుజల్లులు కురుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతం అయ్యింది. నేడు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో కొసాగుతున్న ముసురు: ఉత్తర, సెంట్రల్ తెలంగాణ ప్రాంతాల్లో రోజంతా మబ్బులతో కూడిన వాతావరణం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రం నుంచి రాత్రి సమయంలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. సెంట్రల్, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లోనూ వాతావరణం చల్లబడి తేలికపాటి జల్లులు పడే సూచనలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సైతం సాయంత్రం వేళల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ముసురు కారణంగా వాతావరణం చల్లగా మారింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
Also Read-Assam floods: అస్సాంలో తీవ్రరూపం దాల్చిన వరదలు.. 21కి చేరిన మృతుల సంఖ్య

