Red alert: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దాటికి ఇప్పటికే ముంబయి అతలాకుతలం అయింది. భారీ వర్షాలకు ముంబయి పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దేశ రాజధాని దిల్లీని సైతం భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన అతిభారీ వానలు కురిసే అవకాశం ఉందన భారత వాతావరణ శాఖ(IMD) పేర్కొంది. దిల్లీతో పాటు ముంబాయికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతై తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
స్తంభించిన జనజీవనం: గత వారం రోజులుగా ముంబయిలో కురస్తున్న భారీవర్షాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. పశ్చిమ రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లు సైతం దెబ్బతిన్నాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పాఠశాలలకు సైతం అధికారులు సెలవులు ప్రకటించారు. ఏకదాటిగా కురుస్తున్న భారీ వానలతో ముంబయి పరిసర ప్రాంతాల్లోని ఏడు ప్రధాన సరస్సుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. వీటిలో చిన్నవైన తులసి, విహార్ సరస్సులు బుధవారం రాత్రి నుంచే పొంగిపొర్లుతున్నాయి.ముంబయితో పాటు థానే, పాల్ఘర్, రాయగఢ్ జిల్లాల్లో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే జులై 12 నుంచి వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మహారాష్ర్టలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి భారీవర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన సూచించింది.
Also Read-Kerala: వయనాడ్‌లో మళ్లీ ప్రకృతి ప్రకోపం.. విరిగిపడిన కొండచరియలు
దిల్లీలో భారీ వర్షాలు..రెడ్ అలర్ట్ జారీ!: రాబోయే కొద్ది గంటల్లో దిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రెడ్ అలర్ట్ సైతం జారీచేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ కోరింది.

