HomeTop StoriesAsia Cup: ఆసియా కప్ విజేతగా భారత్.. శ్రీలంకపై ఘన విజయం

Asia Cup: ఆసియా కప్ విజేతగా భారత్.. శ్రీలంకపై ఘన విజయం

Asia Cup: మహిళల ఆసియా కప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ పోరులో భారత్ 72 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కట్టిడి చేశారు. దీంతో లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చమరి ఆటపట్టు (36), నీలాక్షిక (22), విశ్మి గుణరత్నే (20) పరుగులు చేసి విజయం కోసం పోరాడినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలమవడంతో ఓటమి తప్పలేదు. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో విజయంలో కీలక పాత్ర పోషించారు. శ్రీచరణి 4 వికెట్లతో లంక బ్యాటింగ్ వెన్నుముక విరిచగా, దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టి మెరిసింది. క్రాంతి గౌడ్, షెఫాలీ వర్మ, ప్రేమ రావత్ తలో వికెట్ సాధించి లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.

- Advertisement -

రాణించిన భారత ఓపెనర్లు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ 183/5 స్కోరు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (68), స్మృతి మంధాన (59) అర్ధ శతకాలతో అదరగొట్టారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 129 (77 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్‌ (17), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (14) పరుగులు చేశారు. దీంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News