Markets Crash: ఇవాళ ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లు క్రాష్ అయ్యింది. నిన్నటి భారీ నష్టాలను ఇన్వెస్టర్లు జీర్ణించుకోక మునుపే మరో భారీ పతనం మార్కెట్లను కుదిపేసింది. దీంతో ఉదయం 11.24 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీలు భారీ నష్టాల నుంచి కొంత తేరుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 622 పాయింట్లు, నిఫ్టీ 175 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ 837 పాయింట్లు, నిఫ్టీ 943 పాయింట్ల పతనంతో ముందుకు సాగుతున్నాయి. దీంతో దాదాపు నాలుగు నెలల కిందికి నిఫ్టీ సూచీ పడిపోయింది. దీంతో ఐటీతో పాటు ప్రధాన రంగాల సూచీలు ఎరుపెక్కాయి నష్టాలతో.
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ పతనానికి కారణాలను పరిశీలిస్తే.. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రతికూల పవనాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి విలువ క్షీణించడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మార్కెట్ ఒడిదుడుకులను ప్రతిబింబించే ఇండియా విక్స్ 4 శాతం పెరిగి 13.22 వద్దకు చేరడం మార్కెట్లో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది.
also read Bode Prasad : ఎమ్మెల్యే స్విగ్గీ డెలివరీ.. ఆర్డర్ ఇచ్చి అవాక్కైన జనం!
మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేశాయి. గ్రీన్లాండ్‌ను దక్కించుకోవాలనే ప్రతిపాదన.. 8 యూరోపియన్ దేశాలపై టారిఫ్ పెంపు హెచ్చరికలు వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయనే ఆందోళనలు పెంచాయి. దీని ప్రభావంతో అమెరికా మార్కెట్లు 2 శాతం పైగా పడిపోగా.. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
దేశీయంగా చూస్తే.. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా 91.28 వద్ద ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) జనవరి నెలలో వరుసగా 11వ రోజూ అమ్మకాలు కొనసాగిస్తూ రూ. 2,938 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ భారీ అమ్మకాలు మార్కెట్ పతనానికి ప్రధాన కారణమయ్యాయి.
రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ వంటి దిగ్గజ బ్యాంకులు 2 శాతం వరకు నష్టపోయాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 1.5 శాతం మేర పతనమయ్యాయి. సాంకేతిక విశ్లేషణ ప్రకారం, నిఫ్టీ మరికొంత కాలం ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని, కీలక ప్రతిఘటన స్థాయిలను దాటితే తప్ప కోలుకోవడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

