HomeTop StoriesStock market: దలాల్ స్ట్రీట్ అతలాకుతలం.. నిముషాల్లో రూ.8 లక్షల కోట్ల నష్టం!

Stock market: దలాల్ స్ట్రీట్ అతలాకుతలం.. నిముషాల్లో రూ.8 లక్షల కోట్ల నష్టం!

Indian stock market: అంతర్జాతీయ పరిణామాలు భారతీయ స్టాక్ మార్కెట్‌ను అతలాకుతలం చేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు విఫలం కావడంతో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. దీని ప్రభావంతో సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే దేశీయ సూచీలు కుప్పకూలాయి. ఇన్వెస్టర్ల దాదాపు రూ. 8 లక్షల కోట్లు నష్టపోయారు.

- Advertisement -

1,656 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్: ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే సెన్సెక్స్ 1,656 పాయింట్లు నష్టపోయి 75,904 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 477 పాయింట్లు కోల్పోయి 23,574 వద్ద ట్రేడవుతోంది. చమురు ధరలు పెరగడం, హర్మూజ్ జలసంధి దిగ్బంధనం హెచ్చరికలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ప్రస్తుతానికి బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్ రంగాల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే మార్కెట్లు మరిన్ని నష్టాలను చూసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News