Sensex Nifty: దేశీయ స్టాక్ మార్కెట్లు సెప్టెంబర్ చివరి ట్రేడింగ్ రోజును ఫ్లాట్ గా ముగించాయి. గతవారం రోజులుగా బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 2746 పాయింట్ల మేర నష్టాన్ని నమోదు చేయగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 24వేల 650 పాయింట్ల కిందికి పడిపోయింది. ఈ కాలంలో ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, ఎల్ అండ్ టి, టైటాన్ కంపెనీల షేర్లు భారీ పతనంతో సెన్సెక్స్ సూచీకి నష్టాల్లోకి నెట్టాయి.
నేడు ఉదయం ప్రారంభ సమయంలో బెంచ్ మార్క్ సూచీలు లాభాలతో తమ ప్రయాణాన్ని మెుదలు పెట్టినప్పటికీ వాటిని తర్వాత నిలబెట్టుకోలేకపోయాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా అమ్మకాలను కొనసాగించటం సెంటిమెంట్లను దెబ్బతీయగా.. మరో పక్క అక్టోబర్ 1న రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ నిర్ణయాల ప్రకటన ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల దృష్టి దానిపైనే ప్రధానంగా ఉండటంతో అందరూ ఆచితూచి ముందుకు సాగారని నిపుణులు చెబుతున్నారు.
మరో పక్క టెక్నికల్స్ గమనిస్తే ప్రస్తుతం మార్కెట్లలో బలమైన బేర్ మార్కెట్ కొనసాగుతోందని.. దలాల్ స్ట్రీ్ట్ పూర్తిగా బేర్స్ గ్రిప్పులేకి వెళ్లిందని నిపుణుడు వాస్తల్ బువ చెప్పారు. అలాగే నేడు ఇంట్రాడేలో ఎయిర్ టెల్ నష్టాలకు కారణంగా నిలవటంతో పాటు ఐటీసీ, ట్రెంట్, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, టెక్ మహీంద్రా స్టాక్స్ కూడా నష్టాలను మిగిల్చాయి పెట్టుబడిదారులకు. ఇదే క్రమంలో టెక్ దిగ్గజం టీసీఎస్ కంపెనీ షేర్ ధర సరికొత్త 52 వారాల కనిష్ఠాన్ని బీఎస్ఈలో రూ.2886 రేటు వద్ద టచ్ చేసింది. కంపెనీ లేఆఫ్స్ ప్రకటించిన నాటి నుంచి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటూ భారీగా మార్కెట్ క్యాప్ కోల్పోతోంది.
మెుత్తానికి భారత ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్ల చూపు రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటును 5.5 శాతంగా కొనసాగిస్తుందా లేక మెున్న ఫెడ్ ప్రకటన తర్వాత ప్రస్తుతం రేట్ల తగ్గింపులకు వెళుతుందా అనే సందిగ్ధత కొనసాగుతోంది. దీనికి తోడు ఇతర ఎలాంటి ప్రకటనల కోసం ఇన్వెస్టర్లు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


