HomeTop StoriesIPL: హైదరాబాద్‌లో నేడు ఐపీఎల్ సమరం.. లక్నోతో తలపడనున్న సన్‌రైజర్స్!

IPL: హైదరాబాద్‌లో నేడు ఐపీఎల్ సమరం.. లక్నోతో తలపడనున్న సన్‌రైజర్స్!

SRH vs LSG: హైదరాబాద్‌లోని క్రికెట్ అభిమానులకు ఆదివారం అసలైన వినోదం పంచేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు తలపడనున్నాయి.

- Advertisement -

హైదరాబాద్ బలబలాలు: సొంత గడ్డపై ఆడుతుండటం ఆరెంజ్ ఆర్మీకి కలిసొచ్చే అంశం. ప్రస్తుత ఫామ్ ప్రకారం సన్‌రైజర్స్ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడే అవకాశం ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పవర్ ప్లేలో రానిస్తే ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఫినిషర్‌గా హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. ఉప్పల్ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. దీంతో మరోసారి సిక్సర్ల వర్షం ఖాయమని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒత్తిడిలో లక్నో సూపర్ జెయింట్స్: మరోవైపు రిషభ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌లో ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. నేటి మ్యాచ్‌లో గెలిచి ఫామ్‌లోకి రావాలని పట్టుదలతో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. అయితే పంత్ సేన ఆరెంజ్ ఆర్మీ జైత్రయాత్రకు బ్రేక్ వేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

చిన్నస్వామి స్టేడియంలో మరో మ్యాచ్‌: నేడు డబుల్ హెడర్ కావడంతో సాయంత్రం మరో రసవత్తర పోరు జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై జట్టు.. నేటి మ్యాచ్‌లో గెలిచి ఫామ్‌లోకి రావాలని పట్టుదలతో ఉంది. గత రెండు మ్యాచుల్లో విఫలం అయిన సంజు.. ఫాంలోకి రావాలని చెన్నై జట్టు కోరుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్‌ సైతం రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News