HomeTop StoriesStock market: ఆగిన యుద్ధం.. లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్

Stock market: ఆగిన యుద్ధం.. లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్

Iran-US ceasefire: అంతర్జాతీయ పరిణామాల సానుకూల ప్రభావంతో భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో దేశియ మార్కెట్లలో కొత్త ఉత్సాహం నెలకొంది.

- Advertisement -

రికార్డు స్థాయిలో లాభాలు: ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ ఏకంగా 2,700 పాయింట్లకు పైగా లాభపడి ఇన్వెస్టర్ల సంపదను పెంచింది. నిఫ్టీ సైతం 800 పాయింట్లకు పైగా ఎగబాకి కీలక మైలురాళ్లను అధిగమించింది. 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 77,315 స్థాయి వద్ద, నిఫ్టీ 23,915 వద్ద కదలాడుతున్నాయి. అంతే కాకుండా రూపాయి విలవ సైతం పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 50 పైసలు పెరిగి 92.56 వద్ద కొనసాగుతోంది.

సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం వల్ల సరఫరా పునరుద్ధరణ జరుగుతుందన్న ఆశలతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే మార్కెట్లు నేడు మరిన్ని సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.

Also read-Breaking: హార్మూజ్ రీ ఓపెన్‌కు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!

ముడి చమురు ధరల పతనం: యుద్ధ మేఘాలు తొలగిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు శుభపరిణామంగా అంతర్జాతీయ వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే రూపాయి విలువ పెరిగిందని తెలిపారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News