HomeTop StoriesKavitha: 'అవును రేవంత్.. మీరు అందరినీ తొక్కుకుంటూనే పైకొచ్చారు'

Kavitha: ‘అవును రేవంత్.. మీరు అందరినీ తొక్కుకుంటూనే పైకొచ్చారు’

Unemployment issues: సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను అందరినీ తొక్కుకుంటూ సీఎం స్థాయికి ఎదిగానని రేవంత్ పదేపదే చెప్పుకోవడంలో వాస్తవం ఉందని అన్నారు. అందరినీ తొక్కే క్రమంలో నిరుద్యోగుల జీవితాలను కూడా తొక్కేశారని ఆమె మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?: అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిరుద్యోగులకు కొలువులిస్తామని నమ్మించిన రేవంత్‌ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక నిండా ముంచారని కవిత ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆటలు ఆడటానికి సమయం ఉంటుంది కానీ.. నిరుద్యోగుల గోడు వినడానికి సమయం లేదా అని ప్రశ్నించారు.

Also read-Kavitha: ఎస్టీ హాస్టల్ విద్యార్థులపై చీపురుతో దాడి .. రేవంత్‌ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత ఫైర్‌!

నిరుద్యోగుల పక్షాన జాగృతి పోరాటం: రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుందో సమాధానం చెప్పాలని ఆమె కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసే వరకు నిరుద్యోగుల పక్షాన తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని కవిత స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. యువత హక్కుల కోసం తాము పోరాడుతామని భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News