Janasena: ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ.. ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న హైదరాబాద్‌లో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరిట జనసేన సాధక్ సమ్మేళనాన్ని నిర్వహించనుంది.జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సభకు అధ్యక్షత వహించనున్నారు.
ప్రధాన ఉద్దేశం: తెలంగాణలో పార్టీ సంస్థాగత బలాన్ని పెంచడం ఈ సభ ముఖ్య ఉద్దేశంగా పార్టీ పెద్దలు భావిస్తున్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికలతో పాటు భవిష్యత్తు ఎన్నికల్లో జనసేన వ్యూహాలను ఖరారు చేయడంలో భాగంగానే ఈ సభ సాగనుంది. నసేన పార్టీ తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ భారీ సభను హైదరాబాద్‌లో ఏ ప్రాంతంలో నిర్వహించనున్నారనే వివరాలను మాత్రం పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Also read-Telangana: ఉదయం 10 లోపే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. అధికారులను ఆదేశించిన సీఎం!
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత తెలంగాణలో జనసేన నిర్వహిస్తున్న తొలి ప్రధాన సభ ఇదే కావడంతో రాజకీయ వర్గాల్లో దీనిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు, తెలంగాణ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు పవన్ కల్యాణ్ ఈ సభ ద్వారా దిశానిర్దేశం చేయనున్నారు

