HomeTop StoriesJeevan Reddy: రేవంత్‌ రెడ్డిలో అభద్రతా భావం ఎక్కువ.. జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy: రేవంత్‌ రెడ్డిలో అభద్రతా భావం ఎక్కువ.. జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి మరోసారి సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌(Congress)పార్టీ ప్రస్తుతం రేవంత్‌ రెడ్డికి ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా మారిందని అన్నారు. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో కాంగ్రెస్‌ పార్టీని ఖతం పట్టిస్తున్నారని అన్నారు. సీఎంకు అభద్రతా భావం ఎక్కువయ్యిందని అన్నారు. అందుకే రాహుల్‌ గాంధీ విధానాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు.

- Advertisement -

రేవంత్‌పై పట్టుకోల్పోయిన అధిష్టానం: కాంగ్రెస్‌ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను కలిసేందుకు రేవంత్‌ రెడ్డి ఇష్టపడటం లేదని జీవన్‌ రెడ్డి(Jeevan Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం తనకు అవసరం ఉన్న వ్యక్తులతో మాత్రమే రేవంత్‌ రెడ్డి సఖ్యతతో ఉంటారని వ్యాఖ్యానించారు. అందుకే రేవంత్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ అధిష్టానం పట్టు తప్పిందని తెలిపారు.

Also Read-TDP: టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్‌

కేసీఆర్ నన్ను ‘అన్నా’ అని పిలుస్తారు: ప్రస్తుతం తెలంగాణలోని కాంగ్రెస్‌ కార్యకర్తలకు.. పార్టీలో ఎలాంటి గౌరవం లేదని జీవన్‌ రెడ్డి అన్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డికి ప్రజల పట్ల కూడా గౌరవం లేదని తెలిపారు. కానీ కేసీఆర్‌కు ప్రజలంటే ఎంతో గౌరవమని అన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా కేసీఆర్‌(KCR) తన వయసుకు గౌరవం ఇస్తారని తెలిపారు. ఎప్పుడు కలిసిన అన్నా అని ఆప్యాయంగా పిలుస్తారని పేర్కొన్నారు. కార్యకర్తల ఆత్మాభిమానం దెబ్బతినడం, నియోజకవర్గంలో జరిగిన పరిణామాల కారణంగానే బీఆర్ఎస్ పార్టీ చేరేందుకు నిర్ణయించుకున్నట్లు జీవన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News