Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కును వినుయోగించుకునేందుకు యువత పెద్ద ఎత్తున క్యూ లైన్‌లలో ఉన్నారు. మొదటి గంట పోలింగ్ సరళి చూస్తుంటే.. ఈసారి భారీగా ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే పలు పోలింగ్ సెంటర్లలో భారీగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఎర్రగడ్డ, బోరబండ, షేక్‌పేట, వెంగళరావు నగర్ డివిజన్ ప్రాంతాల్లోని ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వచ్చినట్లుగా ఎన్నికల అధికారులు గుర్తించారు. దాదాపు 11 చోట్ల ఈవీఎంలలో సమస్యలు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ఓటర్లు క్యూ లైన్‌లలో ఎదురు చూస్తున్నారు.
చీకట్లో పోలింగ్ సిబ్బంది: షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్ నెం.30లో ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లుగా తెలస్తోంది. దీంతో టెక్నికల్ టీమ్ హుటాహుటిన అక్కడికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక శ్రీనగర్ కాలనీలోని నాగార్జున కమ్యూనిటీ హాల్ పోలింగ్ కేంద్రంలో పవర్ కట్ అయింది. దీంతో అంధకారంలో పోలింగ్ సెంటర్ ఉంది. అయినప్పటికీ పోలింగ్ సిబ్బంది చీకట్లోనే ఏర్పాట్లు పూర్తి చేశారు. వెంగళ్‌రావు నగర్ డివిజన్ 76, 78 బూత్‌లలో ఈవీఎంలు పని చేయకపోవడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో క్యూలైన్‌లో నిల్చున్న ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రహమత్ నగర్ పరిధిలోని 165, 166 పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పోలింగ్ సిబ్బంది ఎన్నికల అధికారులకు సమాచారం అందజేశారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/jubilee-hills-by-election-polling-begins/
వోటర్ హెల్ప్‌లైన్ యాప్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల కమిషన్ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తోంది. ఓటర్లు ఈపీఐసీ వెబ్‌సైట్ లేదా వోటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా తమ పోలింగ్ బూత్ వివరాలను తనిఖీ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఉపఎన్నిక కోసం నాలుగు బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నట్టుగా ఎన్నికల కమిషన్ పేర్కొంది.


