కాకతీయ యూనివర్సిటీ,(తెలుగు ప్రభ):కాకతీయ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకలు (1976-2026),బయోటెక్నాలజీ విభాగం రజతోత్సవ వేడుకలు (2000–2025) సందర్భంగా బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో మోడరన్ బయోటెక్నాలజీ: ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు.విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్‌లో అక్టోబర్ 7,8 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు అధ్యాపకులు,పరిశోధక విద్యార్థులు,విద్యార్థులు పాల్గొననున్నారు.
సదస్సు ప్రారంభోత్సవం అక్టోబర్ 7న ఉదయం 10.30 గంటలకు జరుగుతుంది.ఉపకులపతి ప్రొ.కె.ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా,రిజిస్ట్రార్ ప్రొ.వి.రామచంద్రం గౌరవ అతిథిగా,సైన్స్ ఫ్యాకల్టీ డీన్,ఉపకులపతి ఓఎస్‌డీ ప్రొ.బి.వెంకట్రామ్ రెడ్డి విశిష్ట అతిథిగా హాజరవుతారు.మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డా.గిరిధర్ పర్వతం కీలకోపన్యాసం చేస్తారు.అక్టోబర్ 8న సాయంత్రం 4.15 గంటలకు సదస్సు ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు.
యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.టి.మనోహర్ ముఖ్య అతిథిగా,యూజీసీ యూనిట్ సమన్వయ అధికారి,రూసా 2.0 నోడల్ అధికారి ప్రొ.ఆర్.మల్లికార్జున రెడ్డి గౌరవ అతిథిగా పాల్గొంటారు.సదస్సుకు బయోటెక్నాలజీ విభాగం డా.పి.శ్రీనివాస్ కన్వీనర్‌గా,డా.టి.శాస్త్రి ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.బయోటెక్నాలజీలో సవాళ్లు,అవకాశాలు,పరిశోధన,ఆవిష్కరణలపై సదస్సులో చర్చలు జరగనున్నాయి.

