HomeTop StoriesKarimnagar Bandh: కరీంనగర్‌లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!

Karimnagar Bandh: కరీంనగర్‌లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!

MLA Gangula House Arrest: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య తలెత్తిన రాజకీయ వివాదం కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ నేతల దాడికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శనివారం కరీంనగర్ నగర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నగరవ్యాప్తంగా భారీగా మోహరించారు.

- Advertisement -

గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్: బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. స్థానిక మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బందులో పాల్గొనకుండా ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గంగుల నివాసం వైపు వెళ్లే దారులన్నింటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేవలం ఆయననే కాకుండా నగరంలోని కీలక బీఆర్ఎస్ నాయకులు, పలువురు కార్పొరేటర్లను తెల్లవారుజాము నుంచే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్: ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతుండగా మరోవైపు బీజేపీ నాయకులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ ఎమ్మెల్యేపై జరుగుతున్న రాజకీయ దాడులకు నిరసనగా బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. అయితే కరీంనగర్‌లో బంద్ పాటించాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రజలు, వ్యాపారులు యధావిధిగా తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. వాణిజ్య సంస్థలు యధావిధిగా తెరిచి ఉంచాలని కోరుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో కరీంనగర్ జిల్లా రాజకీయం ప్రస్తుతం అట్టుడుకుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News