HomeTop StoriesIPL: హాట్ టాపిక్‌గా కార్తీక్ శర్మ సెలబ్రేషన్స్.. అచ్చం ధోనీలానే!

IPL: హాట్ టాపిక్‌గా కార్తీక్ శర్మ సెలబ్రేషన్స్.. అచ్చం ధోనీలానే!

Karthik Sharma: ఐపీఎల్ 2026 సీజన్‌లో కీలక దశకు చేరుకుంటున్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అద్భుత విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.

- Advertisement -

ఆడుతూ పాడుతూ లక్ష్య ఛేదన: మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 159 పరుగులకు పరిమితమైంది. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించారు. ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 18.1 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు.

Also read-MI vs CSK: గైక్వాడ్‌ కూల్‌ పర్ఫామెన్స్‌.. ముంబైపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుత విజయం

హాట్ టాపిక్‌గా కార్తీక్ శర్మ సెలబ్రేషన్స్: ఈ మ్యాచ్‌లో చెన్నై యువ సంచలనం కార్తీక్ శర్మ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డ కార్తీక్.. 40 బంతుల్లో 54 పరుగులతో మెరుపు అర్థ సెంచరీ సాధించాడు. అయితే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత కార్తీక్ చేసిన గన్ షాట్(Gun Shot) సెలబ్రేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఎం.ఎస్. ధోనీ ఇదే తరహాలో ఐకానిక్ సెలబ్రేషన్స్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అచ్చం తన మెంటార్ ధోనీ శైలిని అనుకరిస్తూ కార్తీక్ సెలబ్రేట్ చేసుకోవడం అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News