KCR to meet with key BRS leaders: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈనెల 12న కీలక సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ సీనియర్లతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి, శాసనసభాపక్షాల ఉప నాయకులు పాల్గొనున్నారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇంచార్జీల నియామకంతో పాటు పార్టీ బలోపేతం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరగనుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో కీలక నేతలకు బీఆర్‌ఎస్ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై, పార్టీ సంస్ధాగత నిర్మాణంపై కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.
Also read: https://teluguprabha.net/business/big-shock-for-sbi-credit-card-users/

