HomeTop StoriesHigh Court : విజయన్‌కు విచారణ సెగ: కేరళ మాజీ సీఎం, కుమార్తెపై ఎఫ్‌ఐఆర్‌కు ఆదేశం

High Court : విజయన్‌కు విచారణ సెగ: కేరళ మాజీ సీఎం, కుమార్తెపై ఎఫ్‌ఐఆర్‌కు ఆదేశం

Kerala High Court FIR against Pinarayi Vijayan : కేరళ రాజకీయ యవనికపై తీవ్ర సంచలనం రేపుతూ న్యాయస్థానం పిడుగులాంటి తీర్పు వెలువరించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అందించిన ఆధారాల మేరకు కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుటుంబసభ్యులపై అవినీతి నిరోధక చట్టం కింద తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. అయితే, ప్రాథమిక విచారణ పేరుతో సాగదీయాలనుకున్న యంత్రాంగం వాదనలను తోసిపుచ్చుతూ హైకోర్టు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన అసలు మతలబు ఏమిటి?

- Advertisement -

ధర్మాసనం కీలక ఆదేశాలు : సీఎంఆర్​ఎల్​-ఎక్సాలాజిక్ ముడుపుల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్ మాజీ అదనపు ప్రైవేట్ కార్యదర్శి, న్యాయవాది కేఎం షాజహాన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఎ.బద్గరుదీన్ అనుమతించారు. పినరయి విజయన్‌తో పాటు ఆయన కుమార్తె టి. వీణ, అల్లుడు పి.ఎ. మహమ్మద్ రియాస్‌లపై కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

ముడుపుల వ్యవహారం నేపథ్యం : కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (సీఎంఆర్​ఎల్) సంస్థ.. వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కు ఎలాంటి ఐటీ సేవలు పొందకుండానే రూ. 2.78 కోట్ల అక్రమ చెల్లింపులు జరిపిందని ఈడీ గుర్తించింది. నిధుల మళ్లింపు ఆధారాలను ఈడీ పోలీసులకు నివేదించింది. అయితే సర్కారు కేసు నమోదు చేయకుండా సిట్ ద్వారా ప్రాథమిక విచారణకు ఆదేశించడాన్ని పిటిషనర్ సవాలు చేశారు. ఈడీ సమర్పించిన సమాచారమే సరిపోతుందని, కాలయాపన లేకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందేనని కోర్టు తేల్చిచెప్పింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News