HomeTop StoriesPhone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. ఆ ఎమ్మెల్యేకు సిట్‌ నోటీసులు..!

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. ఆ ఎమ్మెల్యేకు సిట్‌ నోటీసులు..!

Key development in phone tapping case: గత బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణలో భాగంగా ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అధికారులు నోటీసులు అందజేశారు. జూన్ 1వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థుల, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మొదటగా డీజీపీకి ఫిర్యాదు చేసిన వారిలో యెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. మరికొందరు అధికార కాంగ్రెస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం బీఆర్‌ఎస్‌ హయాంలో తమ ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. జూన్ 1న యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారుల ముందు హాజరై తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు. ఈ వ్యవహారం నాటి అధికార, నేటి ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మెడకు చుట్టుకుంది.

- Advertisement -

Also read: Revanth government: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.2 వేల కోట్లు పెండింగ్‌ బకాయిలు విడుదల

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News