HomeTop StoriesKhushbu: మహిళను దూషించే హక్కు మీకెవరిచ్చారు?

Khushbu: మహిళను దూషించే హక్కు మీకెవరిచ్చారు?

Khushbu Vs Udhayanidhi: సినీ నటి త్రిష పై డీఎంకే నేత ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఉదయనిధి చేసిన వ్యాఖ్యల పై నటి,బీజేపీ నాయకురాలు ఖుష్బూ మండిపడ్డారు. ధైర్యముంటే మహిళలను తిట్టకుండా రాజకీయం చేయాలంటూ సవాల్‌ చేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయాలతో పాటు త్రిషతో తనకున్న అనుబంధం గురించి కూడా వివరించారు.

- Advertisement -

ఉదయనిధి వ్యాఖ్యలు మహిళలంటే ఆయనకు ఎంత ద్వేషం ఉందో తెలియజేస్తున్నాయని ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నాయకుడిగా ఆయన దీనికి సిగ్గుపడాలని అన్నారు.

మహిళను దూషించే హక్కు..

‘‘ఒక బహిరంగ రాజకీయ వేదికపై మహిళను దూషించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఇది కేవలం ఉదయనిధి విషయంలో మాత్రమే కాదు.. ఇతర రాజకీయ పార్టీలలోనూఇలాగే మహిళలను కించపరస్తూ మాట్లాడటం జరుగుతోంది. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకెన్నాళ్లు మహిళల పై ఇలాంటి నీచమైన నిందలు వేస్తారు? మీ స్వార్థాల కోసం స్త్రీలను అడ్డుపెట్టుకుని ప్రగల్భాలు పలుకుతూ ఆమెను అవమానిస్తున్నారంటే.. మీరు ఎంత బలహీనంగా ఉన్నారో మీ ప్రవర్తనే తెలియజేస్తుంది. మీకు మీరుగా బలమైన నాయకుడిని అని చెప్పుకునే అర్హత కోల్పోయారు.

మీకు ధైర్యముంటే, నిజమైన ప్రజల నాయకుడిగా కొనసాగాలంటే.. ఏ మహిళనూ దూషించకుండా రాజకీయాల్లో నిలిచి చూపించాలి. అంతేకానీ ఇలా మహిళలను నిందించి కాదు. అది చేయగలరో లేదో చూద్దాం’’ అని ఖుష్భూ సవాలు విసిరారు.

త్రిషతో తనకున్న అనుబంధాన్ని ఖుష్బూ ఈ సందర్భంగా పంచుకున్నారు. ‘‘త్రిష చాలా మంచి వ్యక్తి. సినీ పరిశ్రమలోకి రాకముందు నుంచి ఆమె నాకు తెలుసు. నా కుటుంబంలో ఆమె కూడా ఒక సభ్యురాలే అంటూ ఖుష్బూ చెప్పుకొచ్చారు.

Also Read:Weather Update: భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News