SI sexually assaults on constable: సమాజం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఎస్సై.. తోటి ఉద్యోగిణిపై లైంగిక దాడి చేశాడు. ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేశాడు. అంతేకాకుండా ఆ లేడీ కానిస్టేబుల్‌ను గర్భవతిని చేసి.. అబార్షన్ చేయించాడు. దీంతో ఆ యువతి పెళ్లి చేసుకోమని నిలదీస్తే.. ‘నేను ఎస్సై నీతో నాకు పెళ్లేంటి’ అంటూ ఎదురుదాడికి దిగాడు.
కొల్లూరు ఎస్సై సురేశ్‌కుమార్: మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసి.. లైంగిక దాడికి పాల్పడిన కొల్లూరు ఎస్సై సురేశ్‌కుమార్‌ను కూకట్‌పల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో నెలన్నర క్రితమే కేసు నమోదు కాగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్నారు. సురేశ్‌కుమార్‌పై లైంగిక దాడి కేసు నమోదు కావడంతో అతడిని విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
నమ్మించి వంచించిన వైనం: 2020లో సురేశ్‌కుమార్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో అక్కడ రైటర్‌గా ఉన్న మహిళా కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే వివాహమై పిల్లలు ఉన్న విషయాన్ని దాచిపెట్టిన సురేశ్.. ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. 2022 బోనాల పండుగ సందర్భంగా ఓ ఆలయం వద్ద ఆమె నుదుటిన బొట్టు పెట్టి.. మనకు పెళ్లి అయిపోయిందని నమ్మబలికాడు. పెళ్లి పేరుతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భవతి కాగా బలవంతంగా అబార్షన్ చేయించాడు.
Also read-Nepali Gang: జవహర్ నగర్‌లో నేపాలీ గ్యాంగ్ బీభత్సం.. డాక్టర్ దంపతులను బంధించి 60 తులాల బంగారం అపహరణ!
నిలదీస్తే ఎదురుదాడి: ఎస్సైకి అప్పటికే పెళ్లయిందని తెలుసుకున్న బాధితురాలు అతడిని నిలదీయగా.. భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని రెండేళ్ల పాటు కాలయాపన చేశాడు. చివరికి పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చేసరికి “నేను ఎస్సైని.. కానిస్టేబుల్‌ను ఎలా పెళ్లి చేసుకుంటాను?” అంటూ అసభ్య పదజాలంతో దూషించి ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు ఏప్రిల్ 1న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అప్పటి నుండి కుటుంబంతో సహా పరారీలో ఉన్న సురేశ్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

